లేఖిని నాగార్జున గారికి:
నాగార్జున గారూ.. మీరు తయారు చేసిన లేఖిని నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంతకముందు ఎవరన్నా నన్ను తెలుగు ఎలా రాయాలి అని అడిగితే, వారి కంప్యూటర్ను ఎలా కాంఫిగర్ చేస్కోవాలో చెప్తుంటే, అంతగా శ్రద్ధ చూపేవారు కాదు..లేఖిని వచ్చాక నాకు చెప్పడం తేలిక అయ్యింది.. నేను పరిశీలించిన మేరకు క్విల్ ప్యాడ్ కంటే కూడా ఇదే నయం.
ఐతే, లేఖిని గురించి నా ఆశల/అభిప్యారల చిట్టా ఇక్కడ పెడుతున్నా..
1. జి.పి.ఎల్ కి మార్చ గలరు
2. ఒక “ఫోరం” లేఖినితో జత చేస్తే, మరిన్ని ఆలోచనలు పోస్టు చెయ్యచ్చు!
3. మీరు అన్నట్టు లాగిన్ వ్యవస్త వల్ల లేఖినిని వాడటం, లాగిన్ అయీన వాళకే పరిమితం చెయ్యరు కదా.. ఈ విషయం లో మాత్రం జాగ్రత్తగా ఆలోచించండి?
4. లేఖిని లో కింద ఉన్న ప్రకటనల మనకు ఏమాత్రం పనికిరావని నా అభిప్రాయం….అవి తీసేసి “విరాళాలను” ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది??
ఇంకా ఉన్నాయి…గుర్తు చేసుకుని జత చెస్తా..
నిజానికి నా నైపుణ్యం కూడా చాలా తక్కువే, ఐతే (ఫోరంలు జత చెయ్యడం వంటి విషయాలలో కొంచం అనుభవం ఉంది). ఏం చెయ్యమంటారు నేను ఎలక్ట్రానిక్సు వాడిని కదా!
నాగార్జునగారి లేఖిని నా??? మాకెవరికి తెలీదే??? దీని లింకు ఇస్తారా. మాకు తెలిసింది వీవెన్ గారి లేఖిని మాత్రమే.
jyothi
మార్చి 16, 2007
హహ్హ! నేను లేఖిని పేజీని దాచి, దాని స్క్రిప్టు ఫైళ్ళను తెరిచి చూస్తుంటే నాకు తెలిసింది…
వీవెన్ = “నాగార్జున వెన్న” అని!
వీవెన్ అనే పేరు ఎవరు పెట్టుకుంటారు అని నేను కూడా ఎక్కువగా ఆలోచించలేదు…
ఏమో…ఈ విషయం ఆయనే తేల్చి చెప్పాలి!
మధు
మార్చి 16, 2007
నాగార్జున గారు ఆత్మ అయితే లేఖిని (వీవెన్) శరీరం
మొదట స్క్రిప్టు నాగార్జున గారే వ్రాసినారు
కానీ అది చాలా కాంప్లెక్షుగా ఉండి గీకులు మాత్రమే వాడుట వల్ల దానిని సరళీకరణం చేయుట జరిగినది.
నాకు తెలిసి పద్మ (నాగార్జున గారి స్క్రిప్టు ) ఆల్రడీ గీ పీ యల్లే
http://geocities.com/vnagarjuna/padma.html
chavakiran
మార్చి 16, 2007
మధు, కాదు. వీవెన్ నాగార్జున వెన్న
నాగార్జున గారి స్క్రిప్టుకి నేను చిన్న చిన్న మార్పులు చేసి, అందమైన రూపం కల్పించా. అంతే. ఇక పై ఆశల చిట్టాకు సమాధానం:
1. లేఖిని కూడా జి.పి.ఎల్. కానీ నేను పంపిణీ చేయడంలేదంతే. ఇది చూడండి: http://lekhini.org/license.txt
2. ఫోరం సరే.
3. లాగిన్ అనేది ఈ-మెయిల్, ఆటోసేవ్ కావాలనుకున్న వాళ్ళకే. మామూలుగా వాడుకోవడానికి ఎటువంటి నియంత్రణ లేదు.
4. ప్రకటనలు అంత లాభసాటిగా కూడా లేవు. తీసేస్తా. అవసరైనప్పుడు అందరినీ విరాళాలు ఇమ్మంటా.
వీవెన్
మార్చి 16, 2007
పైన కొంత అయోమయం. నాట్ ఈక్వల్ గుర్తు రాలేదు. వీవెన్ వేరు నాగార్జున వెన్న వేరు.
వీవెన్
మార్చి 16, 2007
భలే గమ్మత్తుగా ఉంది…నిజానికి “నాగార్జున వెన్న” మీరు కుదించి వీవెన్ అని చేసుకున్నరేమో అనుకుంటున్నా ఇన్నాళ్ళూ!
నా చిట్టాకు ఓర్పుగా జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, లేఖిని స్క్రిప్టు ఫైళ్ళలో కూడా కొన్ని లైసెన్సు టాగులు ఉన్నాయి…అవి మరి సుద్ధి చేసుకుందామా? (Telugu.js) లో కాపీ రైట్లు ఉన్నాయి కదా…?
మధు
మార్చి 16, 2007