Archive for మార్చి, 2007
ఆవిరౌతున్న మన సినిమా నైపుణ్యం…
మీరు ఒప్పుకుంటారో లేదో కానీ, ఒక రకంగా చెప్పాలంటే, ఇది నిజంగా నిజం. అన్ని రంగాలలో మనం మెల్లగా మరుగున పడిపోతున్నామేమో? చదావండి, మీకు కూడా అనిపిస్తుంది…
ప్రస్థుతానికి, అత్యంత జనాదరణ ఉన్న మన సినిమా-నాటక రంగాన్నే తీస్కుందాం.. ఒకప్పిటి మన సినిమాని చూసి హర్షించని వాడులేడు. ఒకరకంగా చెప్పాలంటే, అప్పట్లో తెలుగు సినిమాలను, అరవంలో డబ్బింగ్ చేశేవారు..మరి ఇప్పుడు కధ అడ్డం తిరిగింది, తమిళ సినిమాలను తెలుగులోకి తర్జుమా చేస్కోవాల్సిన పరిస్థిథి! మనకి అవసరమా… సినిమాలు, కధలు, [...]
లేఖిని నాగార్జున గారికి:
నాగార్జున గారూ.. మీరు తయారు చేసిన లేఖిని నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంతకముందు ఎవరన్నా నన్ను తెలుగు ఎలా రాయాలి అని అడిగితే, వారి కంప్యూటర్ను ఎలా కాంఫిగర్ చేస్కోవాలో చెప్తుంటే, అంతగా శ్రద్ధ చూపేవారు కాదు..లేఖిని వచ్చాక నాకు చెప్పడం తేలిక అయ్యింది.. నేను పరిశీలించిన మేరకు క్విల్ ప్యాడ్ కంటే కూడా ఇదే నయం.
ఐతే, లేఖిని గురించి నా ఆశల/అభిప్యారల చిట్టా ఇక్కడ పెడుతున్నా..
1. జి.పి.ఎల్ కి మార్చ గలరు
2. ఒక “ఫోరం” [...]
అనువాదాల గురించి ఒక మాట:
ముందు మనం జీమయిలు మొత్తాన్ని 100% పూర్తి చేసేసి, ఆ తరవాత అందరం కలిసి దాన్ని క్షుణ్ణం గా పరిశీలించేసి దున్నేద్దాం…ఏమంటారు…
అన్నట్టు…మీరు అనువదిస్తుండగా ఏదన్నా ఆంగ్ల పదానికి మీకు సరైన అనువాదం అనిపిస్తే దాన్ని బయటకి చెప్పడం మరిచిపోవద్దు.
ఉదా: నాకు ‘Delete’ కి ‘రద్దు ‘ కంటే ‘తొలగించు ‘ సరైంది అనిపించింది. ఇలాంటివన్నీ ఒకచోట పేర్చుకోగలిగితే వేరే సాఫ్ట్వేర్ అనువాదాలను తేలికగా చేస్కోవచ్చు….ఏమంటారు?
ఈ అనువాదాలలో చాల మంది చెయ్యి వేస్తున్నారని తెలుసు, ఐతే చేసే వాళ్ళు [...]
జీ మెయిల్ యూఐ అనువాదం పూర్తి
ఔను…జీమయిల్ యూఐ పూర్తయ్యింది…
ఇది నా చేత్లో పూర్తయ్యినందుకు నాకు చాలా ఆనందంగా, గర్వంగా కూడా ఉంది…ఐతే నేను చేసినవి చాలా తక్కువ అనువాదాలు మాత్రమే…మిగితావి కూడా చెయ్యడానికి రెట్టింపు ఉత్సాహం ఇప్పుడే కదా వచ్చింది…ఇక చూడండి, నేను పరిగెడతాను.
మళ్ళీ: పైది పోస్టు చేసిన పది నిమిషాల్లోనే గూగుల్ ప్రధాన సేర్చీ అనువాదం కూడా నా చేతిలోనే పూర్తయ్యింది…
మళ్ళీ: జీమయిల్ ఈమయిలు భాగం కూడా పూర్తి…ఇది నేటి మూడవ విజయం… ఇప్పుడు తెల్లారిందిలే కానీ నాకు యమా నిద్దర [...]
విస్టా గురించి వాగుడు(2)
మొన్న విస్టా గురించి వాగినప్పుడు, అది ఎక్స్ పి కంటే కొంత ఎక్కువగా తెలుగుకి మేలు చేస్తుందనే విషయం అందరికీ అర్ధం అయ్యే ఉంటుంది, ఐతే మిగితా విషయాలు గిరుంచి మనలో కొంతమంది విండోస్ డెవలపర్లు పెదవి విరిచుకున్నట్టు ఉన్నారు. ఏది ఏమైనా వాగడం మొదలెట్టాను కనక, కొనసాగించడం తప్పని సరి అని అర్ధం అయ్యింది. ఐతే..
పేరు చెప్పని ఆసామి అన్నట్టు మ్యాక్ రోజుకి ఒకసారి క్రేష్ ఔతుంది అనే మాట అన్ని సార్లు వాస్తవం కాదండి! [...]
దారి తప్పిన పరాయి బ్లాగు:
ఈపాటికి అందరూ గమనించే ఉండుంటారు, ఎవరో తమ బ్లాగుని ఒక్క తెలుగు అక్షరం కూడా లేకుండా తెలుగు బ్లాగుగా నమోదు చేశారు. విడ్డూరం ఏంటయ్య అంటే, అయ్యగారి బ్లాగుని ఇప్పటికే 3049 సార్లు జనం చదివారంట. బహుశా వెరే వెరే భాషల్లో బ్లాగుని విభాగించుకుంటూ పోతే, అన్ని భాషల వాళ్ళూ ఇదేమిటబ్బా అని చూసేసి ఉంటారు.
లేదా బ్లాగు సందర్శకులను పెంచుకోవటానుకి తుత్తర తెలివితేటలు కాబోలు..ఒకవేళ దారి తప్పు కూడా ఉండచ్చు, ఏమో ఎవరికి తెలుసు ఇందులో తిరకాసు [...]